సున్నిపెంటలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన
శ్రీశైలం,అర్జున్ సమాచారం: శ్రీశైలం ప్రాజెక్టులో ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని సానుకూల దృక్పథంతో పరిశీలించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. 'వన్ మంత్ - ఫోర్ విజిట్' కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట రెడ్డివారి కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్‌లు, శ్రీశైలం ఎమ్మెల్యే...