ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 3:33 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

తెలంగాణ ఉద్యమ కారుడుమాజీ ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి.

తెలంగాణ ఉద్యమ కారుడు
మాజీ ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి.

హైదరాబాద్. అర్జున్ సమాచారం ప్రతినిధి జూలై 31.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిపెట్టారు. గురువారం అర్ధరాత్రి 12:51 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలియగానే అభిమానులు, కార్యకర్తలు, బంధువులు, శ్రేయోభిలాషులలో తీవ్ర విషాదం నెలకొంది.
మరోవైపు నర్సంపేటలో నియోజకవర్గంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. ఆయన భౌతికకాయాన్ని చూసి కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు