ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 7:31 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఈ నెల 2న యూపీఎస్సీ మెడికల్ సర్వీసెస్ పరీక్షలు… తిరుపతిలో పకడ్బందీ ఏర్పాట్లు… ప్రశాంత వాతావరణంలో యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు డీఆర్‌ఓ నరసింహులు సమీక్ష… 3 కేంద్రాల్లో 1,093 మంది అభ్యర్థులకు ఏర్పాట్లు… ఎలక్ట్రానిక్ వస్తువులపై పూర్తి నిషేధం… ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, తాగునీటి సౌకర్యం…

తిరుపతి,అర్జున్ సమాచారం:
ఈ నెల 2వ తేదీన జరగనున్న కేంద్ర ప్రభుత్వ వైద్య సేవల పరీక్షల (యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్) నిర్వహణకు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా మొత్తం శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల (టీటీడీ, వెస్ట్ చర్చ్ రోడ్, బాలాజీ కాలనీ), శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విభాగం-ఎ మరియు విభాగం-బి (పద్మావతి అతిథి గృహం సమీపంలో, ఎస్.పి.డబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రక్కన) అను 3 పరీక్షా కేంద్రాలలో 1,093 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, ఉదయం 09:30 నుండి 11:30 వరకు మరియు మధ్యాహ్నం 02:00 నుండి సాయంత్రం 04:00 వరకు రెండు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతాయని తెలియజేస్తూ, పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్‌లు, వైర్‌లెస్ హెడ్‌సెట్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని హెచ్చరిస్తూ, కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటుతో పాటు అభ్యర్థులు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీరు మరియు శౌచాలయాల వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరిస్తూ, ఈ సమావేశంలో కేంద్ర పరిశీలకులు  ఎన్. వసంత, రాష్ట్ర పరిశీలకులు  బి. ఆనంద్ మరియు సంబందిత అధికారులు పాల్గొన్నారని డీఆర్‌ఓ వెల్లడించారు.