ఈ నెల 2న యూపీఎస్సీ మెడికల్ సర్వీసెస్ పరీక్షలు… తిరుపతిలో పకడ్బందీ ఏర్పాట్లు… ప్రశాంత వాతావరణంలో యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు డీఆర్‌ఓ నరసింహులు సమీక్ష… 3 కేంద్రాల్లో 1,093 మంది అభ్యర్థులకు ఏర్పాట్లు… ఎలక్ట్రానిక్ వస్తువులపై పూర్తి నిషేధం… ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, తాగునీటి సౌకర్యం…
తిరుపతి,అర్జున్ సమాచారం: ఈ నెల 2వ తేదీన జరగనున్న కేంద్ర ప్రభుత్వ వైద్య సేవల పరీక్షల (యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్) నిర్వహణకు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా మొత్తం శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల (టీటీడీ, వెస్ట్ చర్చ్ రోడ్, బాలాజీ కాలనీ), శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విభాగం-ఎ మరియు విభాగం-బి...