కరీంనగర్ లో గల్లీగల్లీని అభివ్రుద్ధి చేస్తా: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి

కరీంనగర్,అర్జున్ సమాచారం: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని గల్లీగల్లీని అభివ్రుద్ధి చేస్తానని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరామర్శలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం 9 గంటలకు తన నివాసం వద్దకు వచ్చిన సందర్శకులను కలుసుకుని వారి సమస్యలను అడిగి...