ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 7:44 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2026 ఘనంగా ప్రారంభం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ

ఆసిఫాబాద్, ఆగస్టు 01,అర్జున్ సమాచారం:

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2026 సందర్భంగా “జీవితానికి స్థిరమైన ప్రారంభం కోసం తల్లిపాలు: పని చేస్తున్న వాటిని బలోపేతం చేద్దాం” అనే ఈ సంవత్సరపు ఇతివృత్తంతో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవగాహన పోస్టర్ ను ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పుట్టిన మొదటి గంటలోపు తల్లిపాలు పట్టించడం, శిశువుకు మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, అనంతరం వయస్సుకు తగిన పరిపూరక ఆహారంతో పాటు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం ద్వారా శిశువుల ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని తెలిపారు.

గర్భిణీలు, బాలింతలు, కుటుంబ సభ్యులు తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి శిశువుకు ఆరోగ్యకరమైన జీవితానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారమని, తల్లికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని పేర్కొన్నారు.

పోషణ అభియాన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుండి 7 వరకు జిల్లాలోని అన్ని అంగన్ వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, గర్భిణీలు బాలింతల సమావేశాలు, ఇంటింటి సందర్శనలు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోషణ అభియాన్ బృందం, సిడిపిఓలు పాల్గొన్నారు
=============================