ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు

ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలగాలి: ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 01: ర్యాగింగ్‌కు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది హెచ్చరించారు. శనివారం మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ మంథని ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్‌పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూజీసీ మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థల్లో ర్యాగింగ్...