‘ఇరుముడి’ మూవీ నుంచి ‘యాలాలో యాలాలో’
మాస్ మహారాజా మోస్ట్ ఎవైటెడ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఇరుముడి' ప్రమోషన్స్ తో ఉత్సాహాన్ని పెంచుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, తన భక్తి గీతమైన మొదటి పాట 'ఇరుముడి కట్టు'తో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే జోరును కొనసాగిస్తూ, కుటుంబ బంధాలలోని ఆప్యాయతను అందంగా చాటిచెప్పే రెండవ పాట 'యాలాలో యాలాలో'ను చిత్ర బృందం విడుదల చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు ఆయన అందించిన సాఫ్ట్ మెలోడీ, ఆర్కెస్ట్రేషన్ ప్రత్యేక ఆకర్షణగా...