రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్‌ త్వరలో అందుబాటులోకి రానున్న సూపర్ స్పెషాలిటీ సర్వీసులు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎంఆర్‌‌ఐ సేవలు జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశంలో వెల్లడించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

    అర్జున్ సమాచారం:   నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్ సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇక్కడ త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్‌ఐ యంత్రాన్ని కొనుగోలు చేస్తున్నామని, త్వరలోనే ఎంఆర్‌ఐ సేవలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ మేరకు సోమవారం, డాక్టర్ బీఆర్‌‌ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో నిజామాబాద్...