తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపనకు అనుమతలు ఇప్పించండి సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ:

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  విజ్ఞప్తి చేశారు. బ్యారేజీ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి , రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి జల్శక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రి తో సమావేశమయ్యారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రాజెక్టుకు...