మూడేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టుకు కూడా అనుమతి తీసుకురాలేదు హరీష్ రావు
హైదరాబాద్,అర్జున్ సమాచారం: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఈనెల 18న హైదరాబాద్ వేదికగా జీఆర్ఎంబీ (GRMB) సమావేశం జరగబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెరో ఎజెండాను సిద్ధం చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మౌనం చూస్తుంటే... జీఆర్ఎంబీ సమావేశం కేవలం ఏపీ ప్రయోజనాల కోసమే జరుగుతోందా? అనే అనుమానం కలుగుతోంది. ఎజెండా వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఏపీ ప్రతిపాదించిన అంశాలు చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న...