విశాఖలో ఐబీఎం(IBM) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్ ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ సేవలకు మద్దతుగా సెంటర్ ఏర్పాటు

విశాఖపట్నం,అర్జున్ సమాచారం: ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం(IBM) విశాఖపట్నంలో తన నూతన ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ (FutureNow Centre)ను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ సేవలకు మద్దతుగా విశాఖ ఇసుకతోట జంక్షన్ లోని లాన్సమ్ స్వ్కేర్ భవనంలో ఐబీఎం సంస్థ ఏర్పాటుచేసిన ఫ్యూచర్‌నౌ సెంటర్‌ను ఐబీఎం ఇండియా, సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ గవర్నెన్స్ ఇంటిలిజెన్స్,...