మయిన్మార్ తో భారత్ స్మూత్ డీల్

న్యూఢిల్లీ, ఆగస్టు 6,అర్జున్ సమాచారం: మయన్మార్ సరిహద్దుల్లో దశాబ్దాలుగా గుర్తించని వివాదాస్పద ప్రాంతాల పరిష్కారం కోసం భారత్ భూభాగ మార్పిడి ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘సరిహద్దులో ఇంకా పరిష్కరించని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి... ఆయా అంశాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు. మణిపూర్ సరిహద్దుల వెంబడి మయన్మార్‌తో భూ మార్పిడికి భారత్ సిద్ధమవుతోందన్న నివేదికలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వివాదాలను పరిష్కరించడానికి...