వెంచర్ పేరిట భారీ మోసం
మేడ్చల్,అర్జున్ సమాచారం: రూపాయి రూపాయి కూడబెట్టి భూమి తీసుకొని సొంత ఇళ్లు కట్టుకుందామనుకున్న వారీ కళ్లలో కారం చల్లాడు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి..హైదరాబాద్ చింతల్ కు చెందిన కల్లూరి సుభాష్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి అనుబంధ గ్రామమైన గూడెం గడ్డ తండాలో అనుమతులు లేకుండా ఎస్ ఆర్ వెంచర్ అనే పేరుతో వెంచర్ చేసి అమాయక ప్రజలను ప్లాట్లను విక్రయించాడు .ఎస్ ఆర్ వెంచర్ కు కనీసం ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం...