అంచనాలకు అనుగుణంగా నాణ్యమైన పనులు చేపట్టాలి పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో గల రెండు పడక గదుల రోడ్ల కొలతలను క్షుణ్ణంగా పరిశీలన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ,అర్జున్ సమాచారం: శుక్రవారం, జిల్లాలోని పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలోని రెండు పడక గదుల లేఅవుట్ లో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించి, దెబ్బతిన్న రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రోడ్డు కొలతలను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, రోడ్ల వెడల్పు, పొడవు, ఇతర కొలతలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోడ్ల నిర్మాణానికి రూపొందించిన అంచనాల ప్రకారం పనులు చేపట్టాలని, ఎక్కడా నాణ్యతలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు....