కేసులకు భయపడేది లేదు.. ప్రజల పక్షాన పోరాడుతాం: మంచిర్యాల కోర్టుకు హాజరైన బాల్క సుమన్
అదిలాబాద్, ఆగస్టు 7,అర్జున్ సమాచారం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల ఘటనపై నమోదైన కేసు విచారణ నిమిత్తం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ఆయన ఈరోజు మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.అనంతరం మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్... క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు స్పష్టమైన...