శాతవాహనలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం -ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి -ఆచార్య సతీష్ కుమార్

కరీంనగర్,అర్జున్ సమాచారం: స్థానిక కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఎస్సి ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో "ప్రపంచ ఆదివాసీ దినోత్సవ" వేడుకలు శుక్రవారం రోజున ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగాయి. సెల్ డైరెక్టర్, ఆర్ట్స్ లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. పద్మావతి అధ్యక్షతన అమరవీరులు, గిరిజన పోరాట యోధులు కొమురం భీమ్, రాంజీ గోండ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, భాషలు, ఆచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని, విద్యార్థులు వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్య...