స్వతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలి సిద్దిపేట

సిద్దిపేట,అర్జున్ సమాచారం: జిల్లాలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై తగు ఆదేశాలు జారీ చేశారు.  స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సిద్దిపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని ఈ వేడుకలను సాంప్రదాయబద్ధంగా ఇన్నోవేటివ్ గా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిధులు, విద్యార్థులు, ప్రజలు, మీడియా వారు అందరూ సౌకర్యవంతంగా కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేయాలని, త్రాగునీరు సౌకర్యం కల్పించాలని అన్నారు....