ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:42 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అట్టహాసంగా అలరించిన ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల “JOYz” ఫ్రెషర్స్ డే వేడుకలు

అట్టహాసంగా అలరించిన ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల “JOYz” ఫ్రెషర్స్ డే వేడుకలు.

జగిత్యాల జిల్లా ,ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 09::

జగిత్యాల ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో “AJOYz” పేరుతో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు అట్టహాసంగా, అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. విద్యార్థుల ఆటపాటలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ వినోద కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.

ఈ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ వి. నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా మరియు సృజనాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.

“JOYz” ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వివిధ కేటగిరీలలో నిర్వహించిన పోటీలలో విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి ప్రత్యేకంగా అభినందించి, బహుమతులు అందజేశారు.

కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులకు ఈ కార్యక్రమం మంచి ఆత్మీయ పరిచయ వేదికగా నిలిచింది. విద్యార్థుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.