పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 09: రామగిరి మండల కేంద్రంలోని సెంటినరీ కాలనీ తెలంగాణ చౌరస్తాలో ఆదివారం 66వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యువ నాయకులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు రామగిరి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కూరి అవినాష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మోత్కూరి అవినాష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యువత కీలక పాత్ర పోషించాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ యువతకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి యువత చేతుల్లోనే ఉందని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి యువజన కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి, ఒర్రె సదయ్య, సీనియర్ నాయకులు విరవేన రాజా మౌళి గౌడ్, టౌన్ యూత్ ప్రెసిడెంట్ కలువల రఘుపతి, టౌన్ ఉపాధ్యక్షుడు ఎండి జుబేర్, కల్వచర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల కృష్ణమూర్తి, ఉపసర్పంచ్ కస్పా మహేందర్ పాల్గొన్నారు. అలాగే యువజన కాంగ్రెస్ నాయకులు బోగే ప్రకాష్, మర్కొండ సంతోష్ గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్, మోత్కూరి వెంకటేష్ గౌడ్, పడాల ప్రసాద్ గౌడ్, సూరం లక్ష్మణ్, ఆరెల్లి మహేందర్, గెట్టేముక్కుల మల్లేష్ గౌడ్, కన్నూరి శ్రీకాంత్, లోంకకేసరం గ్రామ యూత్ ప్రెసిడెంట్ రమేష్ కన్న, గోనె రాము, పన్నూరు గ్రామ యూత్ కార్యదర్శి పంజాల రాకేష్, ముక్కెర సంజయ్ గౌడ్, కుంట చక్రి, రాజాపూర్ గ్రామ యూత్ ప్రెసిడెంట్ మాటేటి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రవితేజ, శివ, పవన్ తదితరులు పాల్గొన్నారు.