సోషల్ మీడియా కేటుగాళ్లపై పోలీసుల నజర్ పోస్టులు పెడతామంటూ బెదిరింపులు.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారులు, ప్రజలే లక్ష్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు మంథనిలో సోషల్ మీడియా ముసుగులో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజల డిమాండ్
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 09: సోషల్ మీడియా ప్రస్తుతం ప్రజల చేతిలో శక్తివంతమైన వేదికగా మారింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు అవినీతి, అక్రమాలను ప్రశ్నించేందుకు ఇది ఉపయోగపడుతోంది. అయితే ఇదే వేదికను కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు మంథని పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెడతామని, పరువు తీస్తామని, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని బెదిరిస్తూ కొందరి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, సామాన్య ప్రజలను...