ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 7:13 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కమలాపూర్ లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ రసాభాస

హనుకొండ,అర్జున్ సమాచారం:
కమలాపూర్ లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ రసాభాస గా మారింది. మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాగ్వాదం నడిచింది. డబుల్ బెడ్రూం ఇండ్లను వదిలేస్తే, నిధులు ఇచ్చి పూర్తిచేసి ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బరాబర్ కేసీఆర్ కట్టిండని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల పరస్పర నినాదాలు మిన్నంటాయి.  పోలీసులు వెంటనే బీఆర్ఎస్ శ్రేణులను బయటకు పంపించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని అనడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సభా వేదికపైనే లేచి వాగ్వాదానికి దిగారు.