ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 6:49 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కల్వచర్లలో సత్య సాయి బాలవికాస్ తరగతులు

కమాన్ పూర్,అర్జున్ సమాచారం:

శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులతో కల్వచర్ల సత్య సాయి భజన మండలి కన్వీనర్ నూక రమేష్  అధ్వర్యంలో గత ఐదు-ఆరు నెలలుగా నిర్వహిస్తున్న శ్రీ సత్య సాయి బాలవికాస్ సెంటర్ లో సోమవారం మరో తరగతి ఉత్సాహంగా జరిగింది. రామగిరి మండలం కల్వచర్ల బస్టాండ్ సమీపంలోని సాయి నిలయంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ తరగతి మధ్యాహ్నం 12:45 గంటల వరకు కొనసాగింది. తరగతిని మంచిర్యాల అభ్యాస స్కూల్ ఉపాధ్యాయురాలు  మరియు వాణి మేడం నిర్వహించారు. బాలలకు ప్రార్థన, సుభాషితాలు, భజనలు, నీతి కథల ద్వారా మంచి విలువలు, సంస్కారాలను బోధించారు. కోఆర్డినేషన్ బిల్డింగ్ ఆక్టివిటీలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రతి ఆదివారం ఈ తరగతులు జరుగుతాయని, తల్లిదండ్రులు తమ పిల్లలతో పాటు తెలిసిన వారి పిల్లలను కూడా పంపించాలని నిర్వాహకులు కోరారు.
================================