ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:02 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కొత్తగూడెం వీకే వర్క్‌షాప్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – వీకే వర్క్‌షాప్‌ కార్మికులను కలిసిన నూతన ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి గట్టయ్య

కొత్తగూడెం,అర్జున్ సమాచారం:
కొత్తగూడెం ఏరియాలోని వీకే వర్క్‌షాప్‌ను నూతన ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి గట్టయ్య మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వర్క్‌షాప్‌లోని అన్ని సెక్షన్ల కార్మికులు, పిట్‌ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వర్క్‌షాప్‌ హెచ్‌ఓడీ క్రిస్టోఫర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కార్మికుల సమస్యలపై చర్చించారు. వర్క్‌షాప్‌లో మ్యాన్‌పవర్‌ పెంపు, కార్మికులకు ప్లే డేలు, పీహెచ్‌డీలు పెంపు, క్యాంటీన్‌ హాల్‌ ఏర్పాటు, ఎలక్ట్రీషియన్లకు రైన్‌కోట్లు, ప్యాంట్‌, షర్ట్‌ అందజేత, ఈఓటీ యంత్రాలను త్వరగా సమకూర్చడం వంటి డిమాండ్లను ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా మహిళా కార్మికుల కోసం ప్రత్యేక రెస్ట్‌రూమ్‌, ఇండోర్‌ కార్మికులకు రెస్ట్‌రూమ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికుల భద్రత, సౌకర్యాల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గట్టయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై వర్క్‌షాప్‌ హెచ్‌ఓడీ క్రిస్టోఫర్‌ సానుకూలంగా స్పందించారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్‌ కార్యదర్శిగా ఎన్నికైన గట్టయ్యకు అభినందనలు తెలిపారు. వర్క్‌షాప్‌ సమస్యలపై ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని, త్వరలోనే సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్క్‌షాప్‌ ఇంజినీర్లు డీవైఎస్‌ఈలు శంకర్‌, అనిల్‌కుమార్‌, ఉపేందర్‌బాబు గట్టయ్యను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని సెక్షన్లకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన బ్రాంచ్‌ కార్యదర్శికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్‌ కార్యదర్శి మధుకృష్ణ, కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్‌ ఆఫీస్‌ బేరర్‌ గుమ్మడి వీరయ్య, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ గుమ్మడి మురళి, వర్క్‌మెన్‌ ఇన్‌స్పెక్టర్‌ మెంగని రోషన్‌, పిట్‌ కమిటీ సభ్యులు సిద్దిరాల రాజకుమారస్వామి, పీఆర్‌సీ రెడ్డి, నరేష్‌, ప్రభాకర్‌, పరశురాములు, కస్తూరి రమేష్‌, అనూష, వెంకటదుర్గ, వసంతిక, రమణ, సంధ్యారాణి, శ్రీమన్నారాయణ, సత్యనారాయణ, ఈశ్వర్‌, మహేష్‌, యాకుబుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ రాజు, రాజయ్య, బొజ్జ వెంకటస్వామి, అత్తహర్‌ పాషా, దుర్గ, హరీష్‌, సామ్యూల్‌ సుధాకర్‌, గోపాల్‌, వెంకట్‌, ఐఎస్‌ చిరంజీవి, సమ్మయ్య, తుమ్మల శ్రీనివాస్‌, మురళి, రమేష్‌, బాబాదిన్‌, కిరణ్‌, సలిగంటి శ్రీనివాస్‌, సముద్రాల శ్రీనివాస్‌, రహీం పాషా, ప్రకాష్‌, ప్రవీణ్‌, కళ్యాణ్‌, కుమార్‌, ఎల్లయ్య, అభిషేక్‌, ఉమామహేశ్వరరావు, జాన్సన్‌, గౌస్‌, అజ్గర్‌, రాజలింగయ్య, మోహన్‌, జయరాజు, చంద్రశేఖర్‌, చందూలాల్‌, యేసురత్నం, మోహన్‌లాల్‌, కిషన్‌, గోపీనాథ్‌, ప్రభాకర్‌, ట్రేడ్‌ అప్రెంటిస్‌లు పాల్గొన్నారు.
=========================