కొత్తగూడెం వీకే వర్క్‌షాప్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – వీకే వర్క్‌షాప్‌ కార్మికులను కలిసిన నూతన ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి గట్టయ్య

కొత్తగూడెం,అర్జున్ సమాచారం: కొత్తగూడెం ఏరియాలోని వీకే వర్క్‌షాప్‌ను నూతన ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి గట్టయ్య మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వర్క్‌షాప్‌లోని అన్ని సెక్షన్ల కార్మికులు, పిట్‌ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వర్క్‌షాప్‌ హెచ్‌ఓడీ క్రిస్టోఫర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కార్మికుల సమస్యలపై చర్చించారు. వర్క్‌షాప్‌లో మ్యాన్‌పవర్‌ పెంపు, కార్మికులకు ప్లే డేలు, పీహెచ్‌డీలు పెంపు, క్యాంటీన్‌ హాల్‌ ఏర్పాటు, ఎలక్ట్రీషియన్లకు రైన్‌కోట్లు, ప్యాంట్‌, షర్ట్‌ అందజేత, ఈఓటీ యంత్రాలను త్వరగా సమకూర్చడం వంటి డిమాండ్లను...