“నరెడ్కో” ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం
నటుడిగా, నిర్మాతగా, ప్రజా నాయకుడిగా సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తున్నారు మురళీమోహన్. ఆయన సేవలను గుర్తించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నరెడ్కో ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొప్పుల మాట్లాడుతూ - ఏపీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ను మురళీమోహన్ గారు...