రక్షణ రంగంలో 62.66 శాతం భారీ వృద్ధి
న్యూఢిల్లీ, ఆగస్టు 11,అర్జున్ సమాచారం: భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త మైలురాయిని అధిగమించాయి. గత ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు ఏకంగా రూ. 38,424 కోట్లకు చేరి, మునుపటి ఏడాదితో పోలిస్తే 62.66 శాతం భారీ వృద్ధిని నమోదు చేశాయి. ఒకప్పుడు కేవలం ‘బ్రహ్మోస్' సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ మాత్రమే భారత ఎగుమతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేది. కానీ మారుతున్న ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా ప్రస్తుతం భారతదేశం డ్రోన్లు, ఖచ్చితత్వంతో దాడి చేసే గైడెడ్ క్షిపణులు,...