పెద్దపల్లి,అర్జున్ సమాచారం:
రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు రైజింగ్ సన్ విద్యార్థి ముబస్సిర్ ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ సయీద్ అహ్మద్ తెలిపారు. ఈనెల 4న సుల్తానాబాద్ పట్టణం లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియే షన్ ఆధ్వర్యంలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరి చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. కాగా ఈనెల 12న సికింద్రాబాద్ జి.ఎస్.ఎం టేబుల్ టెన్నిస్ అకాడమీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొననున్న విద్యార్థి ముబస్సిర్, వ్యాయామ ఉపాధ్యాయుడు తగురం తిరుపతిని పాఠశాల కరస్పాండెంట్ సయీద్ అహ్మద్ ప్రధానోపాధ్యాయు లు హకీమ్ ఖాన్ అభినందిం చారు. అలాగే రాష్ట్రస్థాయి లో రాణించి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
==============================