చెన్నై బుల్లెట్ రైలు కారిడార్లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేర్చాలి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరిన ఎంపి చామల న్యూఢిల్లీ

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: బుధవారం నాడు  న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసారు. హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు కారిడార్లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేర్చే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసారు. గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్కు బదులుగా ఇప్పటికే ఉన్న ఎన్హెచ్-65 (NH-65) కారిడార్ గుండా ఈ మార్గాన్ని నిర్మిస్తే, ఆ ప్రాంతంలోని పట్టణాలు, వాణిజ్య కేంద్రాలు మరియు ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు. ఈ విధంగా మార్గాన్ని మళ్లించడం ద్వారా...