మిల్లర్లనుంచి బకాయిలు వసూలు చేయాల్సిందే హైదరాబాద్

హైదరాబాద్,అర్జున్ సమాచారం: మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపే వారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి  పౌరసరఫరాల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తో కలిసి ఎంసీఆర్హెచ్ఆర్డీలో  సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలకు అవకాశం ఇచ్చి, తిరిగి ఆ తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే...