వందల కోట్ల విలువైన భూములు ఎలా దక్కించుకోవాలో నేర్పించండి: కేటీఆర్ సెటైరికల్ పోస్ట్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాలని ఎద్దేవా చేశారు. నిజమైన స్టార్టప్‌లు ఎదగాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని తాము కష్టపడి టీ హబ్బును నిర్మిస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన కుటుంబ ప్రయోజనాల కోసం ‘అనుముల హబ్స్’ ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఇది ఫ్యామిలీ-రన్: ఫ్యామిలీ-డ్రైవ్...