13వ తేదీ నుంచి శ్రావణమాసోత్సవాలు ప్రారంభం ఆగష్టు 13 నుంచి సెప్టెంబరు 12 వరకు శ్రావణమాసోత్సవాలు భక్తులకు అసౌకర్యం కలుగకుండా వివిధ ఏర్పాట్లు రద్దీరోజులలో ఆర్జిత అభిషేకాల నిలుపుదల రద్దీరోజులలో రాత్రివేళలో మాత్రమే పరిమితంగా స్పర్శదర్శనాలు మూడుశుక్రవారాలలో ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతములు

శ్రీశైలం,అర్జున్ సమాచారం: ఆగష్టు 13 నుంచి సెప్టెంబరు 12 వరకు శ్రావణమాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు  పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి  యం. శ్రీనివాసరావు  తెలిపారు. ఈ మాసోత్సవాలలో అధికసంఖ్యలో భక్తులు  ఆలయాన్ని సందర్శిస్తారన్నారు.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా కర్ణాటక మరియు పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రావణంలో ఆలయాన్ని సందర్శిస్తారన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులకు వసతి, మంచినీటిసరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, సాధారణ రోజులలో శ్రీస్వామిఅమ్మవార్ల ఆర్జితసేవలు, అన్నప్రసాదాల వితరణ, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగు మొదలైన వాటికి...