మేడిగడ్డ బ్యారేజీ కేసు..మాజీ సీఎం కేసీఆర్‌కు మళ్లీ నోటీసులు. హైదరాబాద్

హైదరాబాద్,అర్జున్ సమాచారం: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించిన కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంతో మళ్లీ నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. నోటీసులు పక్కాగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయవాదిని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 9కి వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అక్రమాలు, నాణ్యతా లోపాలపై దాఖలైన ప్రైవేట్‌ పిటిషన్‌పై...