అర్జున్ సమాచారం:
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని
అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యా నికేతన్ లో మాక్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నికకు అన్ని క్లాసుల విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నుకోవడం జరుగుతుంది.దీనిలో ఎన్నికైన వారు ఈ విద్యా సంవత్సరం మొత్తం స్కూల్ ప్రోగ్రామ్స్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. 200మంది విద్యార్థులు, 30మంది ఉపాధ్యాయులు ఓటింగ్ లో పాల్గొన్నారు.స్పోర్ట్స్, కల్చరల్, డీప్యూటీ హెడ్ బాయ్, డీప్యూటీ హెడ్ గర్ల్, హెల్త్ మొదలగు అంశాలలో ఎన్నికలు నిర్వహించినారు.ఈ ఎన్నికల ద్వారా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించబడి ఎన్నికల పద్ధతిని తెలుసుకోవడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎస్ వెంకటేశ్వరరావు, హెచ్ఎంఎస్ జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎలక్షన్ ఆఫీసర్స్ గా టీచర్స్ టీచర్స్ లక్ష్మీ, రవి కుమార్,శ్వేత, రాణి, శైలజ, రవికుమార్, సదానందం, కుమార్.. నిర్వహించారు.
===========================