రాయచోటి, ఆగస్టు 13,అర్జున్ సమాచారం:
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని సంబేపల్లిలో వెలసిన పశుపతి నాథునికి గురువారం వైభవంగా హోమాలు రుద్రాభిషేకాలు నిర్వహించారు.చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తజన సందోహం పూజలు అభిషేకాల లో పాల్గొని తరించా పసుపతినాథునికి వైభవంగా రుద్రాభిషేకంసంబేపల్లె శ్రీ గుహేశ్వరీ సమేత పసుపతినాథ ఆలయంలో 40 రోజుల మండల పూజలు బుధవారం వైభవంగా ముగిశాయి. మండల పూజల సందర్భంగా ప్రతిరోజూ పంచముఖ పశుపతినాథ స్వామివారికి రుద్రాభిషేకాలు, శ్రీ వినాయక స్వామివారికి, శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి, పార్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
40 రోజుల పాటు వేద మంత్రోచ్ఛారణలు, రుద్రఘోషలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తి భావంతో మార్మోగింది. ప్రతిరోజూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పంచముఖ పశుపతినాథ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.మండల పూజలు ముగిసినా.. పసుపతినాథుని సన్నిధిలో ఆధ్యాత్మిక వైభవం మాత్రం కొనసాగుతోంది. గురువారం కూడా పంచముఖ శివునికి ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం మరోసారి శివనామస్మరణతో మార్మోగింది.గురువారం నిర్వహించిన రుద్రాభిషేకానికి సంబేపల్లె పాండురాజులబండకు చెందిన మార్కండేయ శ్రీరాములు–నాగరత్న దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. స్వామివారి సేవలో భాగస్వాములైన దంపతులకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.40 రోజుల మండల పూజలతో భక్తి పరిమళాలు వెదజల్లిన ఆలయం.. పూజలు ముగిసినా నిత్య ఆరాధనలతో ఆధ్యాత్మిక క్షేత్రంగా అలరారుతోంది.సంబేపల్లె శ్రీ గుహేశ్వరీ సమేత పసుపతినాధ ఆలయంలో మండల పూజల ముగింపు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కాంతారా, కోలాటాల కార్యక్రమాలు రాత్రి 2.30 గంటల వరకు భక్తులను అలరించాయి. కళాకారుల అద్భుత ప్రదర్శనలకు భక్తులు మంత్రముగ్ధులయ్యారు.కార్యక్రమా
వారి భజనలో సంగీతం మాత్రమే లేదు.. స్వామివారి పట్ల అచంచలమైన విశ్వాసం ఉంది.
వారి అడుగుల్లో కళాకారుడి ప్రతిభ మాత్రమే లేదు.. భక్తుడి వినయం ఉంది.ఈ ఆలయ ప్రాంగణంలో నలభై రోజుల పాటు మార్మోగిన ‘ఓం నమః శివాయ’ నామస్మరణ వెనుక ఈ కళాకారుల అంకితభావం ఉంది. భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తిన వారి సేవకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.స్వామివారి సన్నిధిలో సేవ చేసే అవకాశం రావడం ఒక వరమైతే.. ఆ వరాన్ని నలభై రోజుల పాటు భక్తితో కొనసాగించడం మహాభాగ్యం.అందుకే ఈ రోజు ప్రతి భజన కళాకారుడికి, ప్రతి బృంద సభ్యుడికి, వారి కుటుంబ సభ్యులకు శతకోటి వందనాలు.. హృదయపూర్వక కృతజ్ఞతలు.. పాదాభివందనాలు.పశుపతినాథ స్వామివారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ.. మీ భక్తి సేవకు మరోసారి శతకోటి వందనాలు….ఆలయ కమిటీసంబేపల్లె శ్రీ గుహేశ్వరీ సమేత పశుపతినాథ స్వామివారి మండల పూజల ముగింపు ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ప్రాంగణం భక్తి సంగీతంతో మార్మోగింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ఆధ్వర్యంలో సాగిన అన్నమయ్య సంకీర్తనలు, హరికథా కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.అన్నమయ్య కీర్తనల మాధుర్యంతో పాటు హరికథా ప్రవచనాలు భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి. అనంతరం రాయచోటి కొత్తపేట భజన బృందం నిర్వహించిన భజనలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచాయి. శివనామస్మరణ, భజనలతో ఆలయ పరిసరాలు మార్మోగగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను ఆస్వాదించారు.మండల పూజల ముగింపు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల్లో భక్తి భావాన్ని మరింత పెంపొందించాయి.
===========================