కొండగట్టు హుండీ లెక్కింపులో డమ్మీ నోట్లు కలకలం
జగిత్యాల ప్రతినిధి ::
అర్జున్ సమాచారం ఆగస్టు 13::
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో భారీగా డమ్మీ నోట్లు బయటపడటం కలకలం రేపింది. 13 హుండీలు, 80 రోజులకు సంబంధించిన కానుకలను లెక్కించగా రూ.1.62 కోట్లకు పైగా ఆదాయం నమోదైంది.
లెక్కింపు సందర్భంగా సుమారు రూ.2.50 లక్షల విలువైన ఐదు బెండళ్ల డమ్మీ నోట్లు గుర్తించారు. డమ్మీ నోట్లను ప్రత్యేకంగా వేరు చేసి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై భక్తుల్లో చర్చనీయాంశంగా మారగా, దేవస్థానం అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.