* నగరంలో చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద వరద నీరు సాఫీగా సాగేలా తీసుకున్న చర్యలు పరిశీలన. * హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య తో పాటు హైడ్రా అదనపు కమిషనర్ ఆనంద్ కుమార్ గారు, ACP లు పుప్పాల తిరుమల , శ్రీకాంత్ హైడ్రా కమిషనర్ పర్యటనలో వున్నారు.

అర్జున్ సమాచారం: నెక్నంపూర్లోని ఇబ్రహీంబాగ్ చెరువుతో పాటు నానక్ రాంగూడ లోని భగీరథమ్మ చెరువు, తౌతానికుంట చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించారు. చెరువుల అభివృద్ధితో పాటే వరద కట్టడికి ఇన్లెట్లు, ఔట్లెట్లు నిర్మాణం శాస్త్రీయంగా ఉండాలని హైడ్రా కమిషనర్ సూచించారు. STP la నిర్మాణం కూడా చెరువుల అభివృద్ధినాటికి పూర్తి కావాలని హైడ్రా కమిషనర్ చెప్పారు. * పూడికను పూర్తి స్థాయిలో తొలగించడమే కాకుండా గతంలోకంటే ఎక్కువ వరద నీరు నిలిచేలా అభివృద్ధి చేయాలన్నారు. * అనంతరం గచ్చిబౌలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బయోడైవర్సిటీ,...