బీజేపీ తెలంగాణ ఎంపీలుగా మేము కేంద్రమంత్రులను కలిసి అనేక సమస్యల మీద వినతులు అందించాం. జవహర్ నగర్ డంప్ యార్డు, హైదరాబాద్ మెట్రో, నేషనల్ హైవేలు, ట్రిపుల్ ఆర్ ల నిర్మాణం వేగవంతం చేయాలని కోరాము. రైల్వే మంత్రిని కలిసి రైలుపట్టాల మీద ప్రమాదాలు జరగకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ROB, RUB సంఖ్య పెంచాలని కోరాము. ఫుట్ ఓవర్ బ్రిడ్జులు సాధ్యమైనన్ని ఎక్కువ నిర్మాణం చేయాలని కోరాము. దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య పరిష్కారం చేస్తామన్నారని ఎంపి ఈటల రాజేందర్ అన్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం కోసం కేంద్రం డబ్బులు ఇస్తే కూడా కేసీఆర్ తీసుకోకుండా అహంకారపూరితంగా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు కానీ ఇందిరమ్మ బొమ్మ మాత్రమే వేసుకుంటాడట. ఒక వైపు నిధులకోసం డిల్లీకి పోతున్నారు.. తెచ్చుకుంటున్నారు. కానీ కేంద్రం ఇస్తుంది అని మాత్రం బయటికి చెప్పడం లేదు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద దేశవ్యాప్తంగా బిపిఎల్ కింద ఉన్న ప్రజలకు రేషన్ బియ్యం అందిస్తుంది. మన రాష్ట్రంలో 57 లక్షల రేషన్ కార్డులు.. 1 కోటి 91 లక్షల మందికి 9 లక్షల 55 వేల మెట్రిక్ టన్నులు బియ్యం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 49.4 లక్షల రేషన్ కార్డులకు 1 కోటి 50 లక్షల మందికి 9 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తుంది. రాష్ట్రం కంటే కేంద్రం ఎక్కువ మందికి బియ్యం ఇస్తుంది. మోడీ ప్రభుత్వం బియ్యం ఉచితంగా ఇస్తుంటే.. కార్డులు మాత్రం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు పెట్టి ఇస్తారట.. ఇదేం సంస్కారం. మీ తాత జాగీరా ? ఈ కార్డులు ఇవ్వడానికి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారు. మీరు పోయి కొత్త ప్రభుత్వం వస్తె మళ్ళీ కార్డులు ఇస్తారా ? కార్డులు శాశ్వతంగా ఉంటాయి మీ ప్రభుత్వం కాదు. ఇప్పుడు కార్డులు లేకపోయినా బియ్యం ఇస్తున్నారుగా.. ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం మీ ఫోటోల కోసమా ? భారత ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో అని రాసి ఫోటోలు లేకుండా కార్డులు ఇవ్వండని సూచించారు.
============================