రేషన్ బియ్యం పంపిణీ సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టు ఉంది. రేషన్ కార్డులపై ఫోటోలు లేకుండా పంపిణీ చేయాలి. లేదంటే ప్రధానమంత్రి ఫోటో కూడా పెట్టాలి. రేషన్ బియ్యానికి ఎక్కువ డబ్బులు ఇస్తుంది కేంద్రమే. ఎంపి ఈటల రాజేందర్

బీజేపీ తెలంగాణ ఎంపీలుగా మేము కేంద్రమంత్రులను కలిసి అనేక సమస్యల మీద వినతులు అందించాం. జవహర్ నగర్ డంప్ యార్డు, హైదరాబాద్ మెట్రో, నేషనల్ హైవేలు, ట్రిపుల్ ఆర్ ల నిర్మాణం వేగవంతం చేయాలని కోరాము. రైల్వే మంత్రిని కలిసి రైలుపట్టాల మీద ప్రమాదాలు జరగకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ROB, RUB సంఖ్య పెంచాలని కోరాము. ఫుట్ ఓవర్ బ్రిడ్జులు సాధ్యమైనన్ని ఎక్కువ నిర్మాణం చేయాలని కోరాము. దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య పరిష్కారం చేస్తామన్నారని ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. డబుల్...