ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 6:25 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఆర్టీసీ బస్సు లో ప్రయాణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అర్జున్ సమాచారం:
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత  ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి‘ పథకం ఏడాది పూర్తైన సందర్భంగా ‘స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పాల్గొన్నారు. స్వాతంత్ర్య వేడుకల అనంతరం పరేడ్ గ్రౌండ్ నుంచి క్యాంప్ కార్యాలయం వరకూ పల్లె  వెలుగు బస్సులో మహిళలతో కలిసి సీఎం ప్రయాణించారు. పథకంతో చేకూరుతున్న లబ్ధిని గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు.
========================