ఎనిమిది దశాబ్దాలైనా ఆశించిన అభివృద్ధి జరగలేదు కేటీఆర్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగురవేసారు. తరువాత  పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్  మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భాషలు, సంస్కృతులు వేరైనా, భారతీయత అనే భావన మనందరినీ కలిపి ముందుకు నడిపిస్తోంది. 150 కోట్ల జనాభా కలిగిన దేశం మనది. స్వాతంత్య్రం సాధించిన తరువాత దేశం బాగుపడాలని ఆనాటి సమరయోధులు ఆశించారు. కానీ, ఎనిమిది దశాబ్దాలైనా వాళ్లు ఆశించిన అభివృద్ధి జరగలేదని అన్నారు....