జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

నిజామాబాద్, ఆగస్టు 15,అర్జున్ సమాచారం: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలనాధికారి భవేష్ మిశ్రా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ట్రైనీ కలెక్టర్ సురేష్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, కలెక్టరేట్ ఏ.ఓ బాలరాజు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -----------------------