పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 15:
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. బసంత్‌నగర్ టోల్‌గేట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు కొట్టుమిట్టాడుతూ మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.