మా సంక్షేమ ఆలోచనలో మానవీయత వుంది ప్రతి పథకంలో శాస్త్రీయ దృక్పథం ఉంది సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్,అర్జున్ సమాచారం: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డిరు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సందేశాన్నిచ్చారు. దేశ స్వాతంత్య్ర కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ గడిచిన రెండున్నరేండ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ రెండున్నరేండ్లలో ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రతి విజయంలో ప్రజలు,...