సప్తధార.. భారత్‌ అభివృద్ధికి మోదీ మాస్టర్‌ప్లాన్‌ ఇదే

న్యూఢిల్లీ, ఆగస్టు 15,అర్జున్ సమాచారం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ భవిష్యత్‌ అభివృద్ధికి కీలకమైన ఏడు రంగాలను ‘శక్తి సప్తధార’గా అభివర్ణించారు. దేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడంతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ ఏడు శక్తులను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. తయారీ రంగం, రైతులు, సాంకేతికత, గతిశక్తి, రక్షణశక్తి, హరిత ఇంధనం, సాఫ్ట్‌ పవర్‌ను భారత్‌ బలాలుగా పేర్కొన్నారు. ఈ రంగాల్లో వేగంగా ముందుకు సాగితే దేశ...