ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 7:47 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సింగరేణిలో కార్మిక సంఘాలన్నింటిని సమానంగా పరిగణించాలి సి.ఐ.టి.యు రాజారెడ్డి…

సింగరేణిలో కార్మిక సంఘాలన్నింటిని సమానంగా పరిగణించాలి సి.ఐ.టి.యు రాజారెడ్డి……

. …. ……. సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి అర్జున్ సమాచారం.. .. .. … ఆగస్టు 16

సింగరేణి సంస్థలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల కాల పరిమితి ముగిసినందున అన్ని కార్మిక సంఘాలను సమానంగానే చూడాలని ఏ సమావేశం నిర్వహించిన యాజమాన్యం గత ఎన్నికలలో పోటీ చేసిన సంఘాల అన్నింటితోను చర్చించాల్సిన అవసరం ఉందని ఆదివారం సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు ఆదివారం ఈ సందర్భంగా ఆయన మందమర్రిలో నిర్వహించిన మాట్లాడుతూ ఈ విషయంలో అన్ని కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని కనుక తక్షణం యాజమాన్యం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల గుర్తింపును రద్దుచేసి అన్ని కార్మిక సంఘాలను కంపెనీకి సంబంధించిన విషయాలలో చర్చించేందుకు సమానంగానే వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం మీద కుట్రలు చేస్తూ కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు కుట్రపూరితంగా సర్కులర్లను జారీ చేయిస్తుందని ఇది సమంజసమైన పద్ధతి కాదని తక్షణం 8 గంటల పని దినాలను అమలు చేయాలని భారత దేశ కార్మిక సంఘాల ఐక్య ఉద్యమాల ధార అన్ని సంస్థలలోనూ ఈ ఉద్యమం కొనసాగుతుందని బిజెపి అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే 8 గంటల పని దినాలకు తిలోదకాలు ఇచ్చిందని ఇది కార్మిక హక్కులను హరించేందుకు పన్నుతున్న రాక్షస చర్యలో భాగమేనని ఆయన అన్నారు సింగరేణి యాజమాన్యం లేబర్ ఆఫీసర్లనుండి వచ్చిన ఆదేశాలను బేఖాతర్ చేస్తూ వ్యవహరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం అవలంబిస్తున్న నియంత పోకడలను అడ్డుకోవడం కోసం పోటీ చేసిన సంఘాలన్నీ ఉమ్మడిగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మందమర్రి ఏరియా నాయకులు పాల్గొన్నరు.