ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 7:36 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సోమ గూడెం (కె) గ్రామపంచాయతీ వీధులను శుభ్రం చేసిన సిపిఐ ( ఏఎం) నాయకులు…..

సోమ గూడెం (కె) గ్రామపంచాయతీ వీధులను శుభ్రం చేసిన సిపిఐ ( ఏఎం) నాయకులు…..

సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 16 .

సోమ గూడెం కె గ్రామంలో ప్రజలు దుర్గంధం తో ఇబ్బందులు ఎదుర్కొంటూ అనారోగ్యం బారిన పడుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కారణంగా ఇక్కడ నివసించే ప్రజలు ప్రతి ఇంట్లో ఒకరు మంచం పట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారని నివసిస్తున్న వారంతా పేద ప్రజలు కాబట్టి ప్రైవేటు వైద్యం అత్యంత ఖర్చులతో కూడుకున్నందున ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లిన సరైన వైద్యం అందడం లేదని చిన్నపిల్లల నుంచి మొదలు కురువృద్ధుల వరకు అందరూ విష జ్వరాలతో అలమటిస్తున్నారని ప్రభుత్వానికి ఎలాగో పట్టింపు లేదు కామైన ఈ కాలనీని శుభ్రం చేసి ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో ఆదివారం సిపిఐ (ఏఎం) నాయకులు కాలనీలోని రోడ్లను రోడ్డు పెరిగిన చెట్లను తొలగించి శుభ్రం చేసి తమ నిరసన తెలియజేస్తూ శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు శుభ్రం చేసిన ప్రాంతాలు వాటర్ ట్యాంక్ ఏరియా నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వరకు రోడ్డు ఇరువైపులా పరిశుభ్రంగా చెట్లను కత్తిరించి చెత్తను గూర్చి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి అజ్మీర శ్రీనివాస్ మార్నేని మనీషా భగత్ సింగ్ యువజన సంఘం నాయకులు చిలుముల శ్రీనివాస్ ఇస్లావత్ సాయి శివ కనుకుల యశ్వంత్ అజ్మీర రమేష్ అక్కేపల్లి సాయి గోసుకుల అంజయ్య దాగం దేవాది కోటేసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు