ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 7:26 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వనమాముల వరదాచార్యుల జయంతి సందర్భంగా ఘన నివాళులు

వనమాముల వరదాచార్యుల జయంతి సందర్భంగా ఘన నివాళులు,

చెన్నూరు: అర్జున్ సమాచారం ఆగస్టు 16:

పట్టణానికి చెందిన ప్రముఖ కవి, సాహితీవేత్త వనమాముల వరదాచార్యుల జయంతిని పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతూ వనమాముల వరదాచార్యుల సాహిత్య సేవలను స్మరించుకున్నారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మనిషేట్టి శ్రీనివాస్, రెవెల్లి మహేష్, ఆరిఫ్, జోడు శంకర్, కౌన్సిలర్ కొప్పుల ప్రభాకర్, మహేందర్ వేముల, జగన్నాధుల శ్రీను, రేణుకుంట్ల శ్రీనివాస్,ఎం.డి. నాయబ్, భారతి, కుందారపు రవి, కొప్పుల రవి, తదితరులు పాల్గొన్నారు.