ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 6:44 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఒక్క వివోఏ… ఎన్నో శాఖల బాధ్యతలు!రుణాల నుంచి పశుపోషణ వరకు… పాఠశాలల నుంచి వ్యవసాయం వరకు అన్నీ వివోఏలపైనే!

ఒక్క వివోఏ… ఎన్నో శాఖల బాధ్యతలు!రుణాల నుంచి పశుపోషణ వరకు… పాఠశాలల నుంచి వ్యవసాయం వరకు అన్నీ వివోఏలపైనే!

అర్జున్ సమాచారం.జులై 15. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల, ఆగస్టు 15:గ్రామీణ మహిళా సంఘాల బలోపేతం, పేద కుటుంబాలకు జీవనోపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్న వివోఏలు ప్రస్తుతం అనేక రకాల బాధ్యతలను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు గ్రామ సంఘాల పుస్తకాల నిర్వహణ, మరోవైపు రుణాల కల్పన, రుణాల వసూళ్లు, మరోవైపు వివిధ జీవనోపాధి కార్యక్రమాల పర్యవేక్షణతో వివోఏలపై పనిభారం రోజురోజుకూ పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉదయం గ్రామ సంఘాల పుస్తకాలు రాయడం నుంచి ప్రారంభమయ్యే పనులు, సభ్యులకు బ్యాంకు రుణాల కోసం దరఖాస్తులు చేయించడం వరకు కొనసాగుతున్నాయి. బ్యాంకు రుణాల ప్రక్రియ పూర్తికాగానే శ్రీనిధి రుణాల కోసం సభ్యులకు సహకరించాల్సి వస్తోంది. రుణాలు ఇప్పించిన అనంతరం వాటి వాయిదాల వసూళ్లపై కూడా దృష్టి పెట్టాల్సి వస్తోంది.కోళ్లు, గొర్రెలు, మేకలు..
. అన్నీ వివోఏల బాధ్యతే!
మహిళా సంఘాల సభ్యులకు పెరటి కోళ్లు, కౌంజు పిట్టలు, గొర్రెలు, మేకలు, పందుల పెంపకం వంటి జీవనోపాధి కార్యక్రమాలను ప్రోత్సహించాలి. చేపల పెంపకం, చేపల విక్రయాలకు సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షించాలి. వెదురు మొక్కల పెంపకం, బుట్టల తయారీ, తస్సార్ వస్త్రాల విక్రయం, తేనెటీగల పెంపకం, తేనె విక్రయం వంటి కార్యక్రమాల్లోనూ సభ్యులకు సహకరించాల్సి వస్తోంది.
ఇక పిండి మరల ఏర్పాటు, వరి ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాల్లో సైతం వివోఏలు!భాగస్వాములు కావాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
పాఠశాలల పనులు సైతం…
వివోఏల బాధ్యతలు మహిళా సంఘాలకే పరిమితం కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌ల కుట్టింపు, సరఫరా వంటి కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి వస్తోంది. నిరక్షరాస్యులకు చదువు నేర్పించడం, బహిరంగ విద్యా పరీక్షలకు హాజరయ్యేలా చూడడం వంటి విద్యా కార్యక్రమాల్లోనూ బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది.
మునగ తోటల పెంపకం, వ్యవసాయ కుంటల ఏర్పాటు వంటి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించాలి. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడం, సభ్యులను సమీకరించడం, రుణాల వివరాలు నమోదు చేయడం, వసూళ్ల పురోగతిని పరిశీలించడం, వివిధ కార్యక్రమాల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించడం వంటి పనులు అదనంగా ఉంటున్నాయి.