ప్రభుత్వ బియ్యం అక్రమ తరలింపుపై రైస్‌మిల్లర్‌పై పీడీ యాక్ట్.రూ.15.70 కోట్ల విలువైన ప్రభుత్వ బియ్యం దారి మళ్లించినట్లు ఆరోపణలు.

ప్రభుత్వ బియ్యం అక్రమ తరలింపుపై రైస్‌మిల్లర్‌పై పీడీ యాక్ట్.రూ.15.70 కోట్ల విలువైన ప్రభుత్వ బియ్యం దారి మళ్లించినట్లు ఆరోపణలు. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 14: ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లించి, బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించి ఆర్థిక లాభాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్‌మిల్లర్ గంప సంతోష్‌కుమార్‌పై పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. బ్లాక్‌మార్కెటింగ్ నిరోధక, నిత్యావసర వస్తువుల సరఫరా పరిరక్షణ చట్టం–1980లోని సెక్షన్...